హ్యాపీ బర్త్ డే మేడమ్


ఆమె వెంట తిప్పించుకున్న, ఆమే.. వెంటపడిన క్యూట్ గా ఉంటుంది. ఎందుకంటే ? ఆమె మేడమ్ అంతే. మేడమ్ రష్మిక మందన పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. మీ టీఎస్ మిర్చి డాట్ కామ్.

కన్నడ చిత్రం ‘కిర్రాక్ పార్టీ’తో తెరకు పరిచయం అయింది రష్మిక మందన. తొలి సినిమాతోనే కిర్రాక్ హీరోయిన్ అనిపించుకొంది. ఆ వెంటనే కన్నడలో అంజనీపుత్ర, ఛమక్ సినిమాలతో విజయాలు అందుకొంది. ఇక ‘ఛలో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఇక్కడ తొలి సినిమాయే సూపర్ హిట్. ‘గీత గోవిందం’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. గీత మేడమ్ గా పాపులర్ అయింది.

దేవదాస్, డియర్ కామ్రేడ్ చిత్రాలతో ఆకట్టుకుంది. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. మహేష్-రస్మిక జంటగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ బ్లాక్ బస్టర్ హిట్. ఇందులో మహేష్ వెంటపడటం, ఆయన్ని ఆటపట్టించడం ఆకట్టుకొంది. ఇక తెలుగులో రస్మికకి వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. సుకుమార్-బన్నీ హ్యాట్రిక్ చిత్రంలోనూ రస్మికనే హీరోయిన్. సుల్తాన్ తో కోలీవుడ్ కి పరిచయం కాబోతుంది. ఇలా.. అడుగుపెట్టిన చోటల్లా రస్మిక స్టార్ హీరోయిన్ గా ఎదగాలని ఆశిస్తూ.. మేడక్ కి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు.