భారత్ లో కరోనా కేసులు 4421, మరణాలు 114

దేశంలో కరోనా రోజురోజూకి విజృంభిస్తోంది. మంగళవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 4421కి చేరింది. వీరిలో 114మంది మరణించగా 3981 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది. ఇక మహారాష్ట్రలో కరోనా ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.

దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 45మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 748కి చేరింది. గుజరాత్‌లో కొవిడ్‌-19 మృతుల సంఖ్య 12కు చేరింది. మధ్యప్రదేశ్‌లో వైరస్‌ తీవ్రత పెరిగింది. మరణాల సంఖ్య తొమ్మిదికి చేరగా 165పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 365కి చేరింది. 11మంది మృతి చెందారు.