లాక్డౌన్ ఎత్తివేతకు నో చెబుతున్న రాష్ట్రాలు ఇవే
కరోనా కట్టడి కోసం ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో 21 రోజుల పాటు.. అంటే ఏప్రిల్14 వరకు లాక్డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14 తర్వాత కూడా లాక్డౌన్ కొనసాగించాలానే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే లాక్డౌన్ కొనసాగిస్తేనే మంచిదని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఝప్తి కూడా చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనని మద్దతుగా మరికొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ కొనగించాలనే కోరుతున్నాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, అసోం, జార్ఖండ్, తమిళనాడు, ఏపీ తదితర రాష్ట్రాలు లాక్డౌన్ మరికొన్ని రోజులు కొనసాగించాలని కోరుతున్నాయి. ఇక దేశంలో సోమవారం నాటికి 4281 కేసులు నమోదయ్యాయి. 114మంది మృతి చెందారు.