మద్యం అమ్మకాలకి 3గంటల పాటు అనుమతి

కరోనా ప్రభావంతో దేశంలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో మద్యం షాపులు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో సుక్కపడితేగానీ రోజు గడవని మందుబాబులు పిచ్చోళ్లు అవుతున్నారు. పిచ్చాసుపత్రులకి క్యూ కడుతున్నారు. ఏప్రిల్ 14 తర్వాత కూడా దేశంలో లాక్‌డౌన్‌ కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నిజంగానే లాక్‌డౌన్‌ కొనసాగించినట్లయితే.. రోజుకు 3 గంటల పాటు మద్యం విక్రయాలకు అనుమతించాలని కర్ణాటక రాష్ట్ర ఎక్సైజ్ శాఖ యోచిస్తోంది. మద్యానికి అలవాటైన మందుబాబులు అనారోగ్యానికి గురవుతున్నారు. కొందరు మందు బాబులు మద్యం లభించడం లేదని ఆత్మహత్యలకు పాల్పడుతున్నఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ను పొడిగిస్తే ప్రతీ రోజు ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు రోజుకు 3 గంటల పాటు మద్యం విక్రయించాలని ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రతిపాదించారు. మరీ.. దాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందేమో చూడాలి.