బన్నీ బర్త్ డే గిఫ్ట్.. అదిరింది !

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ ని మైత్రీ మూవీ మేకర్స్‌ అభిమానులతో పంచుకుంది. ఈ చిత్రానికి ‘పుష్ప’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

‘ఇది నా తర్వాత చిత్రం ఫస్ట్‌లుక్‌. టైటిల్‌ ‘పుష్ప’. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. దీని గురించి చాలా ఉత్సుకతతో ఉన్నా. ఇది మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా’ అని అల్లు అర్జున్‌ ట్వీట్‌ చేశారు. గుబురు గడ్డం, ఒత్తు జుట్టుతో తీక్షణంగా చూస్తున్న బన్ని లుక్‌ మాస్‌ను ఆకట్టుకునేలా ఉంది.