క్రికెటర్ ని చెంపదెబ్బ కొట్టడంపై ప్రియమణి వివరణ

సీనియర్ హీరోయిన్ ప్రియమణి ఓ క్రికెటర్ చెంప చెల్లుమణించింది. ఈ న్యూస్ గతంలో వైరల్ అయింది. సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌ సమయం నాటి న్యూస్ ఇది. తాజాగా ఈ ఘటనపై ప్రియమణి వివరణ ఇచ్చింది.

‘అప్పుడు ఏం జరిగిందో మీకు చెప్తాను. ఓ వ్యక్తి నా ఫోన్ దొంగలించి నాతో ప్రాంక్‌ చేశాడు. రకరకాలుగా ఇబ్బంది పెట్టాడు. ఆ తరువాత నా హోటల్‌ రూమ్‌కు వచ్చాడు. ఆ సమయంలో నాతో అతడు ప్రవర్తించిన విధానం సరిగా లేదని మాత్రమే అతడికి చెప్పాను. ఆ సంఘటన ఓ చేదు అనుభవమే. కానీ నేను అతడిని కొట్టానన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు’ అని ప్రియమణి క్లారిటీ ఇచ్చేసింది. అయితే తనని ఇబ్బంది పెట్టిన క్రెకెటర్ పేరుని మాత్రం ప్రియమణి బయటపెట్టలేదు.