తెలంగాణలో కరోనా తగ్గుముఖం
తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. గురువారం మంత్రి ఈటల మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిని గురించి వివరించారు. ఇప్పటి వరకు 471 కరోనా పాజిటివ్ కేసులు నమోయ్యాయి. 12మంది మృతి చెందారని మంత్రి తెలిపారు. ఈ రోజు రాష్ట్రంలో కొత్తగా 18 పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. అయితే రేపటి నుంచి కరోనా తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉందన్నారు.
‘రేపు మరో 60 నుంచి 70 మంది డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. మర్కజ్ కేసులు లేకపోయి ఉంటే ఇప్పటికే తెలంగాణ కరోనా రహిత రాష్ట్రంగా ఉండేది. రేపటి నుంచి ఈ కేసులు తగ్గే అవకాశం ఉంది. నిన్న 49 ఉంటే.. ఈ రోజు వచ్చినవి కేవలం 18 మాత్రమే. మొత్తం కేసుల్లో 385 మంది మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారు.. వారిని కలిసిన వ్యక్తులే ఉన్నారు’ అని మంత్రి ఈటెల వెల్లడించారు.