కేంద్రం కరోనా సాయం రూ.15,000 కోట్లు

దేశంలో కరోనా కట్టడి కోసం మోడీ ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. ముందు చూపుతో లాక్‌డౌన్ ప్రకటించి చాలా మేరకు కరోనాని కట్టడి చేయగలిగారు. అగ్రరాజ్యం అమెరికాకి కూడా సాధ్యం కానిది మన ప్రధాని చేసి చూపించారు. తాజాగా కరోనా కట్టడి కోసం కేంద్రం రూ.15,000 కోట్లు మంజూరు చేసింది.

 ‘ఇండియా కోవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్ ప్రిపేర్డ్‌నెస్ ప్యాకేజీ’ కింద ఈ మొత్తాన్ని ప్రకటించింది. ఇందులో రూ.7,774 కోట్లు తక్షణ కోవిడ్-19 స్పందన చర్యల కోసం ఖర్చు చేయనుండగా, తక్కిన మొత్తాన్ని మిషన్ మోడ్ విధానంలో మీడియం టెర్మ్ సపోర్ట్‌గా 1 నుంచి 4 ఏళ్ల పాటు ఖర్చు చేయడానికి ఉద్దేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.