సిసిసి సాయం మొదలైంది
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో లాక్డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కఠిన సమయాన సినీ కార్మికులను ఆదుకొనేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ సంస్థకి సినీ ప్రముఖుల నుంచి భారీగా విరాళాలు వెలువెత్తాయి. స్టార్ హీరోల నుంచి చిన్నాచితక నటీనటులు తమవంతుగా సినీ కార్మికులకి సాయం చేశారు.
ఇప్పుడు సిసిసి పని మొదలెట్టింది. సినీ కార్మికుల కోసం నిత్యావసరాలను పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ‘సినీ కార్మికుల ఇళ్లకు నేరుగా ఈ వస్తువులను పంపిణీ చేసే ఈ ప్రక్రియ మొదలైంది’ అంటూ చిరంజీవి ఓ వీడియోను తన ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఎవరెవరికి ఈ సాయం అందనుంది ? ఎంతమంది ? అనేది త్వరలోనే తెలియనుంది.
The food supplies being distributed to the daily wage workers of film industry by #CoronaCrisisCharity are being handled with all due care and being door delivered to the needy. I thank everyone involved in this humanitarian mission. pic.twitter.com/ENgA2UEgZg
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 9, 2020