సుజీత్’కు మెగాస్టార్ ఆఫర్
ఒకే ఒక్క సినిమా ‘రన్ రాజా రన్’తో ఏకంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని డైరెక్ట్ చేసే లక్కీ ఛాన్స్ కొట్టేశాడు దర్శకుడు సుజీత్. అదే సాహో. భారీ బడ్జెట్ తో వచ్చిన పాన్ ఇండియా సినిమా ఇది. అంచనలని అందుకోలేకపోయింది. భారీ బడ్జెట్, అంతకుమించి నటీనటుల ప్రతిభని, విలువైన కాలాన్ని సుజీత్ వృథా చేశాడనే విమర్శలొచ్చాయ్. అయితే ప్లాప్ టాక్ లోనూ సాహో బాలీవుడ్ లో రూ. 150కోట్లు కలెక్ట్ చేయడం ఊరటనిచ్చే విషయం.
సాహో తర్వాత సుజీత్ మరో సినిమా చేయలేదు. ఆయనకి యూవీ క్రియేషన్స్ మరో అవకాశం ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది. కానీ అధికారిక ప్రకటన మాత్రం రావట్లేదు. ఇంతలో సుజీత్ కి మెగా ఆఫర్ దక్కినట్టు తెలుస్తోంది. మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ రిమేక్ రైట్స్ ని చిరు తీసుకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తన కోసమే తీసుకొన్నా.. తానే నటిస్తానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిరు క్లారిటీ ఇచ్చారు.
ఇప్పుడీ సినిమా దర్శకత్వ బాధ్యతలని సుజీత్ కి అప్పజెప్పినట్టు తెలుస్తోంది. తెలుగు నేటివిటికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసే పనిలో సుజీత్ ఉన్నారని చెబుతున్నారు. ఆ పనులు పూర్తయి.. చిరు ఫైనల్ గా ఓకే చెప్పిన వెంటనే అధికారిక ప్రకటన రానుందని సమాచారమ్. ప్రస్తుతం చిరు ఆచార్య సినిమా చేస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత లూసిఫర్ రిమేక్ ఉందనుంది.