వేములవాడ యువకుడికి కరోనా పాజిటివ్ 

ఢిల్లీలోని మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారితో దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వేముల యువకుడికి కరోనా పాజిటివ్ గా తేలింది. వేములవాడ నుంచి నలుగురు యువకులు మార్చి 14న ఢిల్లీలోని మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మార్చి 31 నుంచి నలుగురు యువకులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆ సమయంలో నలుగురికి కరోనా నెగటివ్ వచ్చింది.

గురువారం రెండో సారి నలుగురు యవకుల నమూనాలు పరీక్షల కోసం పంపగా అందులో ఒకరికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఎలాంటి కరోనా లక్షణాలు లేకుండా.. పరీక్షలో మాత్రం పాజిటివ్‌ రావడం ఆశ్చార్యాన్ని కలిగించింది. అయితే కరోనా పాజిటివ్ వచ్చిన యువకుడిని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నారు.