సూపర్ స్టార్ న్యూ ఇయర్ గిఫ్ట్
సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళ ప్రేక్షకులకి అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్టు సమాచారమ్. ఆయన తమిళ్ ప్రజలకి తండ్రిగా మారబోతున్నారు. ఇన్నాళ్లు జయలలిత తమిళ ప్రజలకి అమ్మగా సేవ చేసింది. ఆమె మరణం తర్వాత తమిళనాట రాజకీయ సంక్షోభం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. దాన్ని పూడ్చేందుకు స్టార్ హీరోలు కమల హాసన్, రజనీ కాంత్ రంగంలోకి దిగేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే కమల్ హాసన్ ప్రత్యక్ష పొలిటికల్స్ లోకి రంగంలోకి దూకేశాడు. రజనీ మాత్రం ఊగిసలాటలో ఉన్నారు. కొన్నాళ్ల క్రితం పొలిటికల్ పార్టీ ఏర్పాటులో భాగంగా అభిమానులతో సమావేశాలు నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ సలైంట్ అయిపోయారు.
తాజాగా, సూపర్ స్టార్ మరోసారి ఫ్యాన్స్ తో సమావేశం అవ్వడం ఆయన పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమయిందనే సంకేతాలు వస్తున్నాయి. నూతన సంవత్సరం కానుకగా జనవరి 1న రజనీ పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేయనున్నాడని చెప్పుకొంటున్నారు. ఐతే, ఆయన సొంత పార్టీ పెడతారా.. ? భాజాపాకు మద్దతు ప్రకటిస్తారా.. ?? అన్నది ఆసక్తిగా మారింది. ఐతే, ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఫలితం రజనీని కళ్లు తెరిచేలా చేసిందని చెబుతున్నారు. పళని వర్గం బీజేపీతో అంటగాకడం వల్లే ఉప ఎన్నికలో శశికళ వర్గం విజయం సాధించిందనేది తమిళ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రజనీ భాజాపాకు మద్దతు ప్రకటించి తప్పు చేయరనే టాక్ వినబడుతోంది. ఇక, రజనీ పొలిటికల్ పార్టీ పెడుతున్నారా ? లేదా.. ? పెడితే ఎప్పుడు ? అన్నది మాత్రమే తెలియాల్సి ఉంది.