భారత క్రికెటర్లకు పూర్తి వేతనం

కరోనా ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ ఎఫెక్ట్ తో  ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా ఆటగాళ్ల వేతనాల్లో కోత విధించనున్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డులు తెలిపాయి. అయితే భారత క్రికెటర్లకు మాత్రం పూర్తి వేతనం చెల్లించామని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

“మార్చి 24 తర్వాత నుంచి లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ బీసీసీఐ అన్ని పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. త్రైమాసికానికి చెల్లించాల్సిన పూర్తి వేతనాన్ని ఆటగాళ్లకు చెల్లించింది. అంతేగాక భారత్‌, భారత్-ఎ జట్ల ఆటగాళ్లకు మ్యాచ్‌ ఫీజులను కూడా ఇచ్చింది. ఆటగాళ్ల వేతనాల్లో కోత విధించాలని ఇతర బోర్డులు భావిస్తున్నాయి. కానీ బీసీసీఐ అలా చేయదు. దేశీయ, అంతర్జాతీయ క్రికెటర్లను బాధ పెట్టదు” అని సదరు అధికారు అన్నారు