సచిన్, కోహ్లీలో అదే కామన్ పాయింట్
అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ 100 శతకాలు సాధించాడు. టెస్టుల్లో 51, వన్డేల్లో 49 సెంచరీలు చేశాడు. టీమిండియా విరాట్ కోహ్లీ మాత్రమే సచిన్ సెంచరీల రికార్డుని బద్దలుకొట్టేలా ఉన్నాడు. ఇప్పటికే కోహ్లీ 70 శతకాలు బాదాడు. అయితే కోహ్లీ, సచిన్ లలో ఒక కామన్ పాయింట్ ఉందని ఆస్ట్రేలియా మాజీ సారథి మైకెల్ క్లార్క్ అన్నారు.
అదే ఇద్దరూ భారీ శతకాలు సాధించడానికి ఇష్టపడతారని చెప్పుకొచ్చాడు. ‘నేను చూసిన బ్యాట్స్‌మెన్‌లో సచిన్ బ్యాటింగ్ టెక్నిక్ అత్యుత్తమం. అతడిని ఔట్ చేయడం ఎంతో కష్టం. అతడి బ్యాటింగ్ టెక్నిక్‌లో ఎటువంటి లోపం ఉండదు. క్రీజులోకి వచ్చినప్పుడు అతడు ఏదైనా పొరపాటు చేస్తే ఔట్ చేయొచ్చని ప్రత్యర్థులు భావించేవారు’ అని క్లార్క్ చెప్పుకొచ్చాడు.