మెగా మదర్ సైతం కరోనా సాయం

కరోనా విజృంభిస్తున్న కఠిన సమయాన ఎవరికి తోచినట్టు వారు సాయం చేస్తున్నారు. కరోనాపై యుద్ధంలో నేను సైతం అంటూ మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి మాస్కులు కుడుతున్నారు. ఆమె గత 3 రోజులుగా తన స్నేహితురాళ్లతో కలిసి 700 మాస్క్‌లు కుట్టారు. వీటిని అవసరమైన వారికి అందజేస్తున్నారు. ఈ వయసులోనూ.. దేశంపట్ల, సమాజం పట్ల ఆమె చూపుతున్న బాధ్యతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మెగా మదర్ కి సెల్యూట్ చేస్తున్నారు.

ఇక సినీ కార్మికులని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సిసిసి సంస్థ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ సంస్థకి సినీ తారాలు భారీగానే విరాళాలు ఇచ్చారు. దాదాపు రూ. 6కోట్లు జమ అయ్యాయని తెలిసిందే. ఈ మొత్తంతో నిత్యవసర సరుకులని కొనుగోలు చేశారు. ప్యాకింగ్ కూడా పూర్తికావొస్తోంది. వాటిని నేరుగా సినీ కార్మికుల ఇంటికి వెళ్లి అందజేయనున్నారు.