లాక్ డౌన్ మరో రెండు వారాలు పొడగింపు

కరోనా కట్టడి కోసం దేశంలో 21రోజుల పాటు అంటే ఏప్రిల్ 14 ప్రధాని నరేంద్ర మోడీ విధించిన లాక్ డౌన్ పూర్తికావొస్తోంది. అయితే, దేశంలో ఇంకా కరోనా అదుపులోనికి రానీ నేపథ్యంలో మరికొంత కాలం లాక్ డౌన్ పెంచాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఝప్తి చేస్తున్న సంగతి తెలిసిందే. శనివారం ప్రధాని నరేంద్ర మోడీ అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ పొడిగిస్తేనే మంచిదనే అభిప్రాయాన్ని వెలుబుచ్చాయ్. కనీసం మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ కొనసాగించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధానిని కోరారు. దానికి తగ్గట్టుగానే మరో రెండు వారాలపాటు లాక్ డౌన్ పొడిగించేందుకు కేంద్ర నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ ప్రధాని క్రేజీవాల్ కొద్దిసేపటి క్రితమే ట్విట్ చేశారు. ప్రధాని లాక్ డౌన్ కొనసాగింపునకి నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30 వరకు దేశంలో లాక్ డౌన్ కొనసాగనుందని ఆయన ట్విట్ చేశారు.

దీనికి సంబంధించిన విధివిధాలని ఒకట్రెండు రోజుల్లో కేంద్రం విడుదల చేయనుంది. అయితే ఈ సారి లాక్ డౌన్ కొన్నింటికి మినహాయింపు ఇవ్వనుందని తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి  జాతిని ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా లాక్ డౌన్ పొడగింపుపై ప్రకటన చేయనున్నారు. దాంతో పాటు పలు సూచనలు చేయనున్నారని తెలుస్తోంది.