లాక్‌డౌన్‌ పై కేసీఆర్, జగన్ భిన్నాభిప్రాయాలు


అన్నీ రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లాక్‌డౌన్‌ పొడగింపుపై ముఖ్యమంత్రుల సలహాలు, సూచనలు తెలుసుకున్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రధానిని కోరారు. ఈ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఇంతకుమించిన మార్గం లేదన్నారు. ఏపీ సీఎం జగన్ మాత్రం లాక్‌డౌన్‌ ఎత్తివేతకే మొగ్గు చూపడం విశేషం.

ఆంధ్రప్రదేశ్‌లో రెడ్‌ జోన్ల వరకే లాక్‌డౌన్‌ పరిమితం చేయాలని ప్రధానికి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. కరోనా ప్రభావం ఉన్న 81 మండలాల్లోనే లాక్‌డౌన్‌ విధించాలని సీఎం జగన్‌ ప్రధానిని కోరారు. జనం గుమిగూడకుండా నియంత్రణ చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. ఇక ఫైనల్ గా మరో రెండు వారాలు అంటే ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్‌ పొడగించే ఆలోచనలోనే కేంద్రం ఉన్నట్టు సమాచారమ్.