చిరు అభిమానికి ఆపరేషన్ విజయవంతం
మెగాస్టార్ చిరంజీవి అభిమానికి గుండె ఆపరేషన్ సక్సెస్ అయింది. గుంటూరు జిల్లా ‘చిరంజీవి అంజనా మహిళా సేవా సంస్థ’ అధ్యక్షురాలు రాజనాల వెంకట నాగలక్ష్మి గుండె జబ్బుతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న చిరంజీవి మెడికల్ రిపోర్ట్స్ తెప్పించుకుని.. హైదరాబాద్‌లో వైద్యుడు గోపీచంద్ ద్వారా జబ్బు తీవ్రతను గుర్తించారు. వెంటనే హుటాహుటిగా ఆమెను హైదరాబాద్‌కి రప్పించే ఏర్పాట్లు చేసి, ఆపరేషన్‌కి సంబంధించి అన్ని సదుపాయాలు చూసుకున్నారు.
శనివారం రాజనాల నాగలక్ష్మీ ఆపరేషన్ చేశారు. విజయవంతం అయింది. దీనిపై చిరు మాట్లాడుతూ.. ‘వైద్యడు గోపీచంద్‌కి, ఆయన బృందానికి ధన్యవాదాలు. అలాగే ఈ విషయాన్ని సమయానికి నా దృష్టికి తీసుకొచ్చిన స్వామి నాయుడికి, హైదరాబాద్ వరకు రావటానికి ఏర్పాట్లు చేసిన బి. దిలీప్‌కి, ఇంతదూరం ప్రయాణించడానికి అనుమతిచ్చిన రెండు రాష్ట్రాల పోలీసు అధికారులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా’ అని అన్నారు.
Rajanala Nagalaxmi garu R/o Guntur a fan from long time had heart problem.3 of her heart valves were closed and.Dr.Gopichand performed highly critical 3 1/2 hr surgery & saved her. My deep gratitude to #LifeSaver #DrGopichand of #StarHospitals. #TrueAngels pic.twitter.com/RJ83tfV5pC
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 11, 2020