లాక్డౌన్పై ప్రపంచ బ్యాంక్ నివేదిక.. షాకింగ్ విషయాలు !
లాక్డౌన్ నేపథ్యంలో భారత వృద్ధి రేటుపై ప్రపంచ బ్యాంకు ఓ నివేదికని విడుదల చేసింది. ‘సౌత్ ఏషియా ఎకనామిక్ అప్డేట్: ఇంప్యాక్ట్ ఆఫ్ కొవిడ్-19’ పేరిట విడుదల చేసిన ఈ నివేదిక షాకింగ్ విషయాలని ప్రస్తావించింది. భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా గుదిబండలా మారిందని ప్రపంచ బ్యాంకు అభిప్రాయపడింది.
దీని ప్రభావంతో 2021 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 2.8కి కుచించుకుపోనుందని అంచనా వేసింది అయితే తిరిగి 2022లో వృద్ధి 5శాతానికి పుంజుకుంటుందని తెలిపింది. అప్పటికి కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిపోతుందని పేర్కొంది. దేశంలో ఆహార కొరత లేకుండా జాగ్రత్తపడాలని సూచించారు. బ్యాంకు దివాళాలను అరికట్టాలి. అదేవిధంగా ప్రజలకు స్థానికంగా తాత్కాలిక ఉపాధి అవకాశాలు కల్పించాలని వరల్డ్ బ్యాంక్ తన నివేదికలో పేర్కొంది.