అమెరికాకి చేరిన క్లోరోక్విన్ మాత్రలు
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో భారత సంస్కృత్రి సాంప్రదాయాలు, ఔషధ ఎంత గొప్పదో ప్రపంచ దేశాలకి తెలుస్తోంది. కరోనా కట్టడి కోసం నో షేక్ హ్యాండ్స్. ఓన్లీ నమస్కారమని ప్రపంచ దేశాలు చెబుతున్నారు. నమస్కారం అనేది భారతీయ సాంప్రదాయం. ఇక కరోనా విజృంభిస్తున్న కఠిన సమయాన ఇతరదేశాలకి భారత్ మందులని పంపించి ఆదుకుంటోంది.
కొవిడ్-19 చికిత్సలో క్లోరోక్విన్ మాత్రలు ఆశాజనక ఫలితాలు ఇస్తున్నాయని.. వీటిని రోగులు, వారికి దగ్గరగా ఉండేవారికి ఇవ్వొచ్చని ‘ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్'(ఎఫ్డీఏ) సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ నుంచి క్లోరోక్విన్ మాత్రలు ఇతర దేశాలకి ఎగుమతి అవుతున్నాయి. తొలుత వీటి ఎగుమతులపై భారత్ నిషేధం విధించింది. కానీ, ప్రపంచ దేశాల నుంచి డిమాండ్ పెరగడంతో మానవతా దృక్పథంలో వ్యహరించిన భారత్ నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థన మేరకు భారత్ పంపిన హైడ్రాక్సీక్లోరోక్విన్ సహా ఇతర ప్రాణాధార ఔషధాలు అమెరికాకు చేరాయి.