మందు బాబులకి గుడ్ న్యూస్ : ఐదు రోజుల పాటు మద్యం షాపులకు ప్రభుత్వం అనుమతి
కరోనా కట్టడి కోసం దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మద్యం షాపులు మూతపడ్డాయి. దీంతో మందుబాబులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిచ్చోళ్లు అవుతున్నారు. ఆసుపత్రులకి క్యూకడుతున్నారు. ఈ నేపథ్యంలో మందు బాబుల పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రభుత్వం ఓ ఐదు రోజుల పాటు మద్యం షాపులు తెరిచేందుకు అనుమని ఇచ్చింది. అయితే అది మన తెలుగు రాష్ట్రాల్లో కాదు. మేఘాలయ ప్రభుత్వం మాత్రమే మద్యం షాపులకి ఓ ఐదు రోజుల పాటు స్పెషల్ పర్మిషన్ ఇచ్చింది.
ఈ నెల 13 నుంచి 17 వరకు మేఘాలయలో మద్యం షాపులు తెరచుకోనున్నాయి. అదీకూడా ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు మాత్రమే. ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లి మద్యం కొనుక్కునేందుకు అనుమతి లేదు. అలాగే మద్యం షాపుల మద్యం సామాజిక దూరం పాటించాల్సిందేనని షరతులు పెట్టింది. ఇక మేఘాలయ ప్రభుత్వం మాదిరిగానే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మద్యం షాపులకి స్పెషల్ పర్మిషన్ ఇస్తే బాగుంటుందని.. ఇక్కడి మందు బాబులు కోరుతున్నారు.