వైరల్ : హోం క్వారంటైన్ లో రవితేజ ఫ్యామిలీ.. పిక్స్  


కరోనా కట్టడి కోసం దేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో సినిమా షూటింగ్స్ అన్నీ వాయిదా పడ్దాయి. సినీ తారలు ఇంటికే పరిమితమయ్యారు. నచ్చిన పనులు చేసుకుంటున్నారు. కొత్త కొత్త పనులు ట్రై చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా మాస్ మహారాజా రవితేజ ఫ్యామిలీ హోం క్వారంటైన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రవితేజ తన కుమారుడు, ఇతర కుటుంబసభ్యులతో ఇంట్లోనే ఉంటున్నాడు. తన కుటుంబసభ్యులతో రవితేజ దిగిన ఒకట్రెండు 
ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోల్లో రవితేజ డిఫరెంట్ మీసం కట్టుతో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన క్రాక్ సినిమాతో బిజీగా ఉన్నాడు. రవితేజ-గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రమిది. శృతిహాసన్ హీరోయిన్. ఈ సినిమా తర్వాత రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ సినిమా ఉండనుంది.