ఉత్తమ్.. ఈ టైంలోనూ రాజకీయాలేనా ?
దేశంలో కరోనా ఫీవర్ నడుస్తోంది. కరోనా కట్టడి కోసం ప్రధాని నరేంద్ర మోడీ, మన రాష్ట్రం విషయానికొస్తే సీఎం కేసీఆర్ ప్రై ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే ఇలాంటి కఠిన సమయాన ప్రతిక్షాలు మాత్రం రాజకీయాలు చేయడం మానలేదు. కరోనా విజృంభిస్తున్న కఠనా సమయాన ఇన్నాళ్లు కనిపించని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఇవాళ మీడియా ముందుకొచ్చారు. సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యాడు. ఎందుకు అంటే.. ? ఆయనకి కరోనా లెక్కలు చూపించాలట. దానికి గిదేనా ? టైమూ… !
ఉత్తమ్ ఇవాళ కాంగ్రెస్ ప్రముఖులుగా పేర్కొనబడే దామోదర రాజనర్సింహ, సంపత్, దాసోజు శ్రవణ్, మర్రి శశిధర్రెడ్డి కాన్ఫరెన్స్లో మాట్లాడారు. పేదలకు కరోనా సాయం అందుతుందా..? లేదా..? అనేదానిపై నాలుగు మాటలు మాట్లాడుకున్నరు. ఆ తర్వాత మీడియా ముందుకొచ్చిన ఉత్తమ్ ‘ప్రభుత్వానికి మార్చి నెల ఆదాయం తగ్గలేదు. బాండ్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఏం చేశారో చెప్పాలి? కరోనా కోసం కేసీఆర్ ప్రభుత్వం పెద్దగా ఖర్చు చేసిందేమీ లేదు. పారిశుద్ధ్య కార్మికులకు రెండు నెలలుగా జీతాలు అందడం లేదు. కరోనాపై ఖర్చు వివరాలు ఇవ్వాలని సీఎంకు లేఖ రాస్తా’ను అని మొత్తుకున్నడు.