కరోనాపై డబ్ల్యూహెచ్‌ఓ షాకింగ్ నిజాలు

ప్రపంచ దేశాలని వణికిస్తోన్న కరోనా వైరస్ ఇప్పట్లో తగ్గదని ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అభిప్రాయపడింది. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే వరకూ ఈ వైరస్‌ ముప్పు పొంచివుందని డబ్ల్యూహెచ్‌ఓ అధికార ప్రతినిధి డా.డేవిడ్‌ నాబర్రో అంచనా వేశారు.కొంతకాలం పాటు తగ్గినట్లు కనిపించినప్పటికీ..మళ్లీ తిరిగి విజృంభించే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ సమయంలో వైరస్‌ను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ, లక్షణాలున్న వారిని వెంటనే ఐసోలేట్‌ చేసే పద్దతి కొనసాగిస్తూనే ఉండాలని సూచించారు.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 18లక్షల మందికి సోకిన కరోనా వైరస్‌ కారణంగా లక్షా పదివేల మంది మృత్యువాతపడ్డారు. కేవలం అమెరికాలోనే 20వేల మంది చనిపోగా మరో ఐదు లక్షలకుపైగా అమెరికన్లు ఈవైరస్‌ బారినపడ్డారు.  చైనాలో కరోనా తగ్గుముఖం పట్టినట్టే పట్టీ.. తిరిగి పుంజుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మరికొద్దిరోజుల్లో కరోనా ప్రభావం తగ్గుతుందని చెబుతున్న దేశాలకి తాజా ప్రపంచ ఆర్యోగ సంస్థ హెచ్చరికలు షాక్ ని కలిగిస్తున్నాయి.