ప్రధాని కంటే ముందే సోనియా గాంధీ వీడియో సందేశం
మరికాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. లాక్ డౌన్ పొడగింపుపై ప్రకటన చేయనున్నాయి. అయితే ప్రధాని ప్రసంగం కంటే ముందే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఓ వీడియా సందేశం విడుదల చేశారు. కరోనాపై పోరులో ముందుండి దేశ రక్షణకు పాటుపడుతున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర అత్యవసర సేవల్లో విధులు నిర్వర్తిస్తున్న సోనియా ప్రశంసించారు. వీరు అందిస్తున్న సేవల కంటే గొప్ప దేశభక్తి ఏముంటుందని కొనియాడారు. వారి స్ఫూర్తిని తీసుకొని మరింత ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, ఐక్యతాభావంతో ఈ ఆరోగ్య సంక్షోభాన్ని ఓడిద్దాం అని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని.. సామాజిక దూరం పాటించాలని గుర్తుచేశారు. మాస్కులు ధరించాలని సూచించారు. దేశం మొత్తం కరోనా మహమ్మారిని ఓడించేందుకు మహా పోరుకు సిద్ధమైన ఈ తరుణంలో కాంగ్రెస్ కార్యకర్తలు తమ బాధ్యతను నిర్వర్తించాలని సోనియా పిలుపునిచ్చారు. క్షేత్ర స్థాయిలో కావాల్సిన సహకారాన్ని అందించాలని కోరారు. దీనికి కాంగ్రెస్ నాయకుల పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
कांग्रेस अध्यक्षा श्रीमती सोनिया गांधी का देश के नाम संदेश:-
कोरोना संकट में डॉक्टर्स, सफाईकर्मियों, पुलिस सहित सरकारी अधिकारियों के डटे रहने से बड़ी "देशभक्ति" कोई नहीं है। हम एकता, अनुशासन और आत्मबल के भाव से कोरोना को परास्त करेंगे। धैर्य एवं संयम के लिए देशवासियों का धन्यवाद। pic.twitter.com/Sl4zkKURTv— Congress (@INCIndia) April 14, 2020