మోడీ తాతయ్య లాక్ డౌన్ ఉంచూ.. !
ప్రధాని నరేంద్ర మోడీ మరికాసేపట్లో జాతినుద్దేశించి మాట్లాడనున్నారు. మరో రెండు వారాల పాటు అంటే ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ కొనసాగింపుపై ప్రకటన చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని ఏమైనా మినహాయింపులు ఇస్తారా ? అన్నది ఆసక్తిగా మారింది. లాక్ డౌన్ పొడగిస్తుండటంతో సినీతారలు మరికొన్నాళ్లు ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి.
దీని గురించి దర్శకుడు శివ నిర్వాణ ఆసక్తికర ట్విట్ చేశారు. మజలీ సినిమా షూటింగ్ సమయంలోనే శివ నిర్వాణికి కొడుకుపుట్టిన సంగతి తెలిసిందే. కరోనా లాక్ డౌన్ సెలవులన్నీ తనయుడుతో గడుపుతున్నాడు శివ. తాజాగా ఆయన కొడుకు దిగిన ఫోటోని ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ‘మోడీ తాతయ్య లాక్ డౌన్ ఉంచూ.. నాన్న నాతో ఉంటాడు’ అనే కామెంట్ పెట్టాడు. ఈ క్యూట్ కామెంట్ అందరినీ ఆకట్టుకుంటోంది.
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా టక్ జగదీష్ తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండతో శివ నిర్వాణ సినిమా ఉండనుంది. నిన్నుకోరి, మజిలీ చిత్రాలతో సూపర్ హిట్ అందుకున్న శివ నిర్వాణ.. ఎమోషనల్ లవ్ స్టోరీని డీల్ చేయడంలో ప్రత్యేకతని చాటుకున్నారు.
Modi thathyya lockdown inkaa unchuu.. nanna nathone untadu😌 pic.twitter.com/fqUlfSFRzK
— Shiva nirvana (@ShivaNirvana) April 14, 2020