మహేష్ నుంచి డిజిటల్ యాప్

భవిష్యత్ డిజిటల్ మీడియాదే అంటున్నారు. కరోనా ఎఫెక్ట్ తో ఇప్పట్లో థియేటర్స్ తెరచుకొనేలా లేవ్. ఒకవేళ తెరచుకొన్నా జనాలు థియేటర్ కి వెళ్లి సినిమాలు చూసే సాసహం చేయకపోవచ్చు. ఈ నేపథ్యంలో డిజిట‌ల్ స్ట్రీమింగ్ యాప్ ల‌కే ఊపు వ‌స్తోంది.  రాబోయే రోజులు పూర్తిగా డిజిట‌ల్ స్ట్రీమింగ్ దే హ‌వా ఉంటుంద‌ని, వెబ్ సీరిస్ లు రాజ్యం ఏల‌తాయ‌నే సంకేతాలు క‌నిపిస్తూ ఉన్నాయి.

ఈ క్ర‌మంలో సినిమా హీరోలు ఈ వ్యాపారంలోకి దిగుతూ ఉన్నారు. ఇప్ప‌టికే తెలుగు సినిమా వాళ్లు *ఆహా* అంటూ ఒక యాప్ మొద‌లెట్టారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ కూడా ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నట్టు తెలిసింది.  ముంబైలోని ఒక వ్యాపార సంస్థ‌తో క‌లిసి మ‌హేశ్ బాబు డిజిట‌ల్ స్ట్రీమింగ్ యాప్ ను ప్రారంభించ‌బోతున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. బాలీవుడ్ ప‌త్రిక‌లే ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ ఉన్నాయి.

దీని కోస‌మ‌ని మ‌హేశ్ కొన్ని సినిమాల‌ను కూడా తీయిస్తాడ‌ని, వెబ్ సీరిస్ లు కూడా ప్లాన్లో ఉన్నాయ‌ని స‌మాచారం. మహేష్ ఒక్కరే కాదు.. మిగితా హీరోలు, వ్యాపార ప్రముఖులు, నిర్మాతలు డిజిటల్ ఫార్మెట్ వైపు చూస్తున్నారు.