‘రామరాజు ఫర్ భీమ్’ రెడీ అవుతోంది !

ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి రూపొందిస్తున్న మల్టీస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌.ఆర్‌.ఆర్‌). రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా వచ్చిన ‘భీమ్ ఫర్ రామరాజు’ ప్రోమోకి మంచి స్పందన వచ్చింది. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా మే 20న ‘రామరాజు ఫర్ భీమ్’ ప్రోమో రాబోతుంది. ఇందుకోసం ఇప్పటికే నుంచే కసరత్తు మొదలైనట్టు తెలుస్తోంది. కరోనా లాక్‌డౌన్‌ తో ఇంటికే పరిమితమైన రాజమౌళి వీడియో కాల్‌ ద్వారా నటీనటులు, సాంకేతిక నిపుణులతో ముచ్చటిస్తూ ప్రోమో రూపకల్పన కోసం శ్రమిస్తున్నారని తెలుస్తోంది.

తొలితరం స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీం, అల్లూరి సీతారామరాజుల మధ్య ఓ కామెన్ పాయింట్ ఆధారంగా ఆర్ ఆర్ ఆర్ ని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఇందులో కొమరం భీమ్ గా ఎన్ టీఆర్.. ఆయనకి జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలివియో మోరీస్ నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. ఆయనకి జంటగా అలియా భట్ నటిస్తున్నారు. ఈ యేడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఆర్ ఆర్ ఆర్ వచ్చే యేడాది జనవరి 8కి వాయిదా పడిన సంగతి తెలిసిందే.