F2 కోసం వెంకీ-వరుణ్ ఫిక్స్

హ్యాట్రిక్ హిట్స్ దర్శకుడు అనిల్ రాఘవపూడి ఓ మల్టీస్టారర్ సినిమాని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. దిల్‌ రాజు బ్యానర్‌లో తెరకెక్కనున్న ఈ మల్టీస్టారర్‌ చిత్రానికి ఇప్పటికే ‘ఎఫ్‌ 2’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇద్దరు హీరోల్లో ఒకరు సీనియర్‌ హీరో మరొకరు యంగ్‌ హీరో ఉంటారు దర్శకుడు ముందే ప్రకటించారు. ఇప్పటికే సీనియర్ హీరోగా విక్టరీ వెంకటేష్’ని అనుకొన్నారు. ఇక, యంగ్ హీరోగా చాలామంది పేర్లే వినిపించాయి. చివరికి మెగా యంగ్ హీరో సాయిధరమ్ పేరు ఖరారు అయినట్టేనని చెప్పుకొన్నారు.

ఇప్పుడు సాయిధరమ్ తేజు స్థానంలో వరుణ్ తేజు వచ్చేశాడు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సా. తేజు ఎఫ్ 2 కోసం డేట్స్ ని అడ్జెస్ట్ చేయలేకపోయాడట. దీంతో… ఆయన స్థానంలో వరుణ్ తేజుని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. టైటిల్ కి తగ్గట్టుగా ఇందులో ఓ హీరో ఫన్ క్రియేట్ చేస్తే.. మరో హీరో ప్రస్టేషన్ చూపిస్తాడట. ఫన్ పండించడంలో వెంకీని మించునోడు లేడు. మరీ.. వరుణ్ తేజు ఏ రేంజ్ లో ఫ్రస్టేషన్ చూపిస్తాడో చూడాలి. ఈ సినిమాని వచ్చే యేడాది జనవరిలో సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. దసరా లేదా దీపావఌ కానుకగా రిలీజ్ చేయనున్నారు.