ఏప్రిల్ 20 తర్వాత కొత్త లాక్ డౌన్ నిబంధనలు
ప్రధాని నరేంద్ర నరేంద్ర మోడీ జాతినుద్దేశించి మాట్లాడారు. మే 3 వరకు లాక్ డౌన్ పొడగిస్తున్నట్టు ప్రకటించారు. అంటే.. మరో 19రోజుల పాటు లాక్ డౌన్ కొనసాగనుంది అన్నమాట. గతంలో విధించిన 21 రోజుల లాక్ డౌన్ ని కూడా కలుపుకుంటే మొత్తం 40 రోజులపాటు దేశంలో లాక్ డౌన్ విధించినట్టు అయింది.
లాక్ డౌన్ కు సంబంధించి రేపు కేంద్ర హోంశాఖ పూర్తి గైడ్ లైన్స్ ని విడుదల చేయనుంది. మరోవారం రోజుల పాటు ఎప్పటిలాగే లాక్ డౌన్ ని కఠినంగా అమలు చేయనున్నారు. అయితే ఏప్రిల్ 20 తర్వాత మాత్రం కొత్త లాక్ డౌన్ నిబంధనలు అమలులోనికి రానున్నట్టు తెలుస్తోంది. అవే రెడ్, ఆరేంజ్, గ్రీన్ జోన్లు అని తెలిసింది.
ఇక మిగితా దేశాలతో పోలిస్తే కరోనా విషయంలో మనం చాలా మెరుగ్గా ఉన్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. లాక్ డౌన్, సామాజిక దూరం వలన లాభపడ్దాం అన్నారు ప్రధాని. కరోనాకి మందు కనుగొనేందుకు యువ శాస్త్రవేత్తలని కోరుతున్నానని ప్రధాని అన్నారు.