పోలీసుల్లో ఉత్సాహాన్ని నింపిన రౌడీ హీరో
కరోనా లాక్‌డౌన్ తో సినీతారాలు ఇంటికే పరితమయ్యారు. ఇంట్లో నచ్చిన పనులు చేసుకుంటున్నారు. మరీ.. బోర్ కొడితే అభిమానులతో చిట్ చాట్ చేస్తున్నారు. వారు అడిగే ప్రశ్నలకి ఆసక్తికర సమాధానాలు చెబుతున్నారు. అయితే రౌడీ హీరో విజయ్ దేవరకొండ మాత్రం పోలీసులతో చిట్ చాట్ చేశారు. కరోనా విజృంభిస్తున్న కఠిన సమయాన విధులు నిర్వహిస్తున్న పోలీసుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు.
హైదరాబాద్‌లోని వివిధ ప్రదేశాల్లో పనిచేస్తున్న పోలీసు అధికారులతో విజయ్ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా మాట్లాడారు. పోలీస్ కమిషనర్ అంజన్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో విజయ్ పోలీసుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు విజయ్ సమాధానాలు చెప్పారు.
మన సీఎం కేసీఆర్ సర్ బయటకు రావొద్దని చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్లు చెప్పిన తర్వాత కూడా బయట తిరిగే వాళ్లకు మీ పద్ధతిలోనే సమాధానం చెప్పాలి అన్నారు విజయ్. మిమ్మల్ని పోలీసు అధికారి పాత్రలో చూడాలని ఉందని అడగగా.. తప్పకుండా మంచి స్క్రిప్ట్ వస్తే చేస్తా. రెండు, మూడు సంవత్సరాల్లో మంచి పోలీసు పాత్రతో మీ ముందుకు వస్తానని హామీ ఇచ్చారు. మేం ఇంట్లో కూర్చుంటే.. మీరు పని గంటలు పెంచుకొని మా కోసం రోడ్ల మీద డ్యూటీలు చేస్తున్నారు. పోలీసులందరికీ కృతజ్ఝతలు తెలిపారు విజయ్.