ఒత్తిడిలో విజయ్ ఏం చేస్తారంటే ?
కరోనా లాక్‌డౌన్ తో సినీతారాలు ఇంటికే పరితమయ్యారు. ఇంట్లో పర్సనల్ పనులు చేసుకుంటున్నారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ మాత్రం కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రదేశాల్లో పనిచేస్తున్న పోలీసు అధికారులతో విజయ్ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా మాట్లాడారు. పోలీస్ కమిషనర్ అంజన్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో విజయ్ పోలీసుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నించారు.
ఈ సందర్భంగా మీరు ఒత్తిడిలో ఉంటే ఏం చేస్తారు ? అని ఓ పోలీస్ అడిగారు. దానికి విజయ్ ఆసక్తికర సమాధానం చెప్పారు. ‘నా పనే నాకు గుర్తింపు ఇచ్చింది. మీ అందరి ప్రేమనిచ్చింది. పరాజయాలు ఎదురైనా, మనసు బాగోలేకపోయినా.. నా పని మీద మరింత దృష్టి పెడతా. నేను చిన్నప్పుడు పాఠశాలలో ‘మహా భారతం’ నాటకంలో పాల్గొన్నా. అప్పుడు కృష్ణుడు అన్న మాటలు నా మీద బలంగా ప్రభావం చూపాయి. ఈ సమయం గడిచిపోతుంది.. నిజమే, ఏ సమయం అయినా శాశ్వతం కాదు. కరోనా కూడా అంతే. మనం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కరోనా మన జీవితాల్లో ఓ జ్ఞాపకంగా మిగిలిపోతుంది’ అన్నారు.