వెబ్ సిరీస్’పై మణిరత్నం మాట
అంతా డిజిటల్ ఫార్మెట్ వైపు చూస్తున్నారు. వెబ్ సిరీస్ లు, కొత్త కొత్త యాప్ లు పుట్టుకొస్తున్నారు. స్టార్ హీరోలు, బడా నిర్మాతలు అటు వైపు చూస్తున్నారు. గ్రేట్ దర్శకుడు మణిరత్నం కూడా ఓ అభిమాని వెబ్ సిరీస్ లు తీయమని కోరాడు. దానికి ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు.
‘నేను టెన్నిస్‌ను 20 ఏళ్లుగా ఆడుతున్నా. కానీ మీరు నన్ను ఫుట్‌బాల్ ఆడమని అడుగుతున్నారు. నేను ఆడినా గెలవలేను. ఎవరైనా సరే వారు ఎందులో ఉత్తమమో అదే చేయాలి. అలా కాదని మరోదాని కోసం వెళితే నష్టపోతాం’ అని మణిరత్నం సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్యరాయ్ బచ్చన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి తదితరులు నటిస్తున్నారు.