దగ్గాడని కాల్చేశాడు

కరోనా ఫీవర్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ఎవరైనా దగ్గినా, తుమ్మిన పక్కనవాళ్లకి బాంబుపడినంత పనవుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ వ్యక్తి దగ్గాడని.. అతడిని తుపాకితో కాల్చేసిన దారుణ ఘటన చోటు చేసుకుంది.

గ్రేటర్‌ నోయిడాలో ప్రశాంత్‌సింగ్‌ అలియాస్‌ ప్రవేశ్‌ (25), జై వీర్‌సింగ్‌ అలియాస్‌ గుల్లూ (30) దయానగర్‌లో వ్యవసాయం చేస్తారు. మంగళవారం రాత్రి ప్రశాంత్‌ మరో ముగ్గురు కలిసి లూడో ఆడుతున్నారు. అప్పుడే గుల్లూ అక్కడికి వచ్చాడు. ఆ సమయంలో ప్రవేశ్‌ దగ్గడంతో అతడితో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్యా గొడవ ముదరడంతో సహనం కోల్పోయిన గుల్లూ వెంటనే తుపాకీ తీసి అతడిని కాల్చేశాడు. గాయపడ్డ ప్రవేశ్‌ను వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.