దేశంలో హాట్ స్పాట్స్ లెక్క తేలింది !

దేశంలో కరోనా విజృంభిస్తోంది. దాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్నీ విధాల ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా కరోనా హాట్‌స్పాట్‌ కేంద్రాలు, నాన్‌ హాట్‌స్పాట్‌ కేంద్రాలు, గ్రీన్‌జోన్లను గుర్తించామని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 170 జిల్లాలు కరోనా హాట్‌స్పాట్స్‌, 207 జిల్లాలను నాన్‌ హాట్‌స్పాట్‌ జిల్లాలుగానూ, మిగిలినవి గ్రీన్‌జోన్‌లోనూ గుర్తించినట్టు తెలిపింది.

దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1076 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశం మొత్తంమీద కేసుల సంఖ్య 11,439కి చేరిందని కేంద్ర వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఇప్పటి వరకు 377 మంది ప్రాణాలు కోల్పోగా.. వైరస్‌ బారిన పడిన వారిలో 11.41 శాతం మంది కోలుకున్నారని తెలిపారు.