రెండో ప్యాకేజీకి రెడీ అవుతుందా ?
లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలు, మధ్యతరగతి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.1.7 లక్షల కోట్లతో ఉద్దీపన పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేంద్రం మరో ప్యాకేజ్ రెడీ చేస్తోందని తెలిసింది. ఇప్పుడు పరిశ్రమలపై దృష్టి సారించింది. కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న రంగాల కోసం రెండో ఉద్దీపన పథకం ప్రకటించే అవకాశముందని సమాచారం.
గురువారం భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని ప్రధాని నరేంద్రమోదీ సమీక్షించారు. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల నుంచి విమానయాన రంగం వరకు, నిరుద్యోగం గురించి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన చర్చించారని తెలిసింది. మహమ్మారి వల్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఆతిథ్యం, పౌర విమానయానం, వ్యవసాయం తదితర రంగాలు క్షీణించాయి. ఈ నేపథ్యంలో పరిశ్రమలకి ఆదుకొనేలా రెండో ప్యాకేజీని రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది.