తెలంగాణలో లాక్‌డౌన్ మినహాంపుల్లేవ్ !

తెలంగాణలో కరోనా కంట్రోల్ కావడం లేదు. రోజురోజూకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గురువారం ఒక్కరోజే 50 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయ్. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరింత కఠినంగా లాక్‌డౌన్ ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 20 తర్వాత కేంద్రం లాక్‌డౌన్ నుంచి కొన్ని రంగాలకి మినహాయింపు ఇవ్వాలని భావించింది. కానీ, తెలంగాణలో ఆ మినహాయింపులు కూడా ఇవ్వకూడని ప్రభుత్వం భావిస్తోంది.

కరోనాని పూర్తిస్థాయిలో కంట్రోల్ చేయాలని ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారమ్. మరోవైపు, ఈ కఠిన సమయాన తెరాస నేతలు ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రజల మధ్యనే తిరుగుతున్నారు. వారి సమస్యలని తెలుసుకొంటున్నారు. ఇక ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 700 దాటింది.