భర్త ముందే శ్రియని అంత మాట అనేశాడు

సీనియర్ హీరోయిన్ శ్రియ పెద్ద ముదురు అనుకొంటే.. ఆమె భర్త ఆమెని మించినోడు ఉన్నట్టున్నాడు. కరోనా లాక్‌డౌన్ తో సినీతారలు ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ ఖాళీ సమయాల్లో అభిమానులతో చిట్ చాట్ చేస్తున్నారు. శ్రియ కూడా గురువారం అభిమానులతో లైవ్ చాట్ చేసింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ శ్రియకి అసభ్యకరమైన కామెంట్ పెట్టాడు. మీ ఎద అందాలు సూపర్ అనేశాడు.

ఆ కామెంట్ ని పక్కనే ఉన్న భర్త ఆండ్రీకి గట్టిగా చదివి వినిపించింది శ్రియ. దీనిపై ఆండ్రీ రియాక్షన్ షాక్ కి గురిచేసింది. మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నా. ఇంకా ఎక్కువ కామెంట్ చేయండి అని అన్నాడు ఆండ్రీ. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం శ్రియ-ఆండ్రీ బార్సినాలో ఉంటున్నారు. ఇటీవల భర్త ఆండ్రీకి కరోనా లక్షణాలు కనబడటంతో శ్రియ ఆందోళన చెందింది. కానీ, అది కొద్దిపాటి జాగ్రత్తలతో తగ్గడంతో ఊపిరిపీల్చుకుంది.