భారత నేవీలో 20మంది కరోనా

భారత్ లో కరోనా వేగంగా విజృంభిస్తోంది. ఇప్పుడీ ఈ మహమ్మారి భారత్ నేవీలోకి ప్రవేశించింది. నేవీలో దాదాపు 20మంది కరోనా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం వీరిని ముంబయిలోని ఐఎన్ హెచ్ ఎస్ అశ్వినీ నేవీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నట్లు సమాచారం.

భారత నేవీలో కరోనా కేసులు వెలుగులోకి రావడం ఇదే తొలిసారి. సోకినప్పుడు వీరంతా ఐఎన్ ఎస్ యాంగ్రీ కి చెందిన నివాస స్థావరాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు వైరస్ సోకిన వారితో కలిసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. అలాగే ఆ చుట్టుపక్కల విధులు నిర్వర్తించిన సైనికుల్ని కూడా గుర్తించేందుకు యత్నిస్తున్నారు.

ఇక భారత సైనికాదళంలో ఇప్పటి వరకు 8 మందికి వైరస్ సోకినట్లు ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవణే శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరు వైద్యులు, ఒకరు నర్స్ కాగా.. మిగిలిన వారు సైనికులు.