జగన్ సర్కార్ పై వెంకయ్య ప్రశంసలు

కరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. దక్షిణ కొరియా నుంచి లక్ష రాపిడ్‌ టెస్ట్‌ కిట్లను ఆంధ్రప్రదేశ్‌ దిగుమతి చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై వెంకయ్య సంతోషం వ్యక్తం చేశారు.

కరోనా నిర్ధారణ పరీక్షలను మరింత వేగవంతా నిర్వహించేందుకు రాపిడ్‌ టెస్ట్‌ కిట్లు ఉపయోగపడతాయి. ఈ కిట్ల ద్వారా 10 నిమిషాల్లోనే ఫలితాలు వస్తాయని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. వీటి ద్వారా రోజుకు 10వేల మందికి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటడం మంచి పరిణామం అన్నారు.