వార్నర్ కి సాయం కావాలట 

ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ కి సాయం కావాలట. ఎందుకంటే ? బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ పాటకి డ్యాన్స్ నేర్పించడానికి. వార్నర్ తన కుమార్తెతో కలిసి కత్రినా కైఫ్‌ ఆడిపాడిన పాపులర్‌ గీతం ‘షీలాకీ జవానీ..’కి టిక్‌టాక్‌ చేశారు. దీన్ని వార్నర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. దీన్ని పది గంటల్లో 6 లక్షల మందికిపైగా వీక్షించారు.

ఈ రెస్పాన్స్ ని చూసి.. ఇదే పాటకు మరోసారి టిక్‌టాక్‌ చేశారు. ఫ్యాన్స్‌ కోసం మరో వీడియోను చేశానని, దయచేసి మాకెవరైనా డ్యాన్స్‌ నేర్పించండని క్యాప్షన్‌ ఇచ్చారు. వార్నర్ డ్యాన్స్ కి నెటిజన్స్ ఫిదా అయ్యారు. ‘వావ్, క్యూట్, మీరిద్దరు కత్రిన కంటే బాగా డ్యాన్స్‌ చేస్తున్నారు, అద్భుతం.. అంటూ కామెంట్స్ చేశారు.