అమితాబ్ ప్రధాని కావాలనుకున్నారా ?

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాని కావాలనుకున్నారా ? ఇదే ప్రశ్నని ఓ అభిమాని అడిగారు. దానికి బిగ్ బీ పగలబడి నవ్వారు. ‘అరే బాబు.. పొద్దుపొద్దున్నా కాస్త పాజిటివ్‌గా ఉండు, మాట్లాడు’ అని పగలబడి నవ్వుతున్న ఎమోజీని పోస్ట్‌ చేశారు.

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో సినీ తారలు ఇంటికే పరిమితమయ్యారు. సోషల్‌మీడియాలో చురుగ్గా ఉంటూ కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. సరదాగా అభిమానులతో చిట్ చాట్ చేస్తున్నారు. బిగ్ బీ అమితాబ్ కూడా అభిమానులతో చాట్ చేశారు. ఈ సందర్భంగా ఓ అభిమాని బిగ్ బీగ్ ని మీరు ఎప్పుడైనా ప్రధాని కావాలనుకున్నారా ? అంటూ ప్రశ్నించి నవ్వులు పూయించారు.
 .