‘శ్రీమంతుడు’కి 100 మిలియన్ వ్యూస్

కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం ‘శ్రీమంతుడు’ (2015). శృతిహాసన్ హీరోయిన్. మనం సంపాదించిన దానిలో ఎంతో కొంత మనం పుట్టి, పెరిగిన ఊరికి ఇవ్వాలనే మంచి కాన్సెప్ట్‌తో వచ్చిన శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తాజాగా ‘శ్రీమంతుడు’ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో 100 మిలియన్ల మంది వీక్షించారు. తెలుగులో ఓ పూర్తి చిత్రాన్ని 100 మిలియన్ల మంది వీక్షించడం ఇది తొలిసారి.

ఇక ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలోని ‘దిమాక్‌ కరాబే’ సాంగ్ యూట్యూబ్ లో100మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. అలాగే ప్రభాస్ కూడా ఈ ఘనతని సాధించాడు. ప్రభాస్ ‘రెబల్’ సినిమాలో క్లైమాక్స్ యాక్షన్ సీన్ ని కూడా యూట్యూబ్ లో100 మిలియన్ల మంది వీక్షించారు. మొత్తానికి టాలీవుడ్ స్టార్స్ మహేష్, రామ్, ప్రభాస్ లు యూట్యూబ్ లో 100మిలియన్ వ్యూస్ టేస్ట్ చూశారు.