కోటి పాట : జయహో పోలీస్‌.. సూపర్

మహమ్మారి కరోనా వైరస్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇప్పటికే చాలా పాటలొచ్చాయ్. వాటిలో కొన్ని వైరల్ అయ్యాయి. తాజాగా కరోనా విజృంభిస్తున్న కఠిన సమయాన విధులు నిర్వహిస్తున్న పోలీసులపై సంగీత దర్శకుడు ఓ పాట పాడారు. ‘జయహో పోలీస్‌.. యు ఆర్‌ ది వారియర్స్‌.. యు ఆర్‌ ది సేవియర్స్‌’.. అంటూ సాగే పాట ఆకట్టుకుంటోంది.

కరోనా వైరస్‌ కల్లోలం సృష్టిస్తున్న తరుణంలో మన సంక్షేమం కోసం తమ కుటుంబాలను వదులుకుని పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ వారు చేస్తున్న సేవలకు సెల్యూట్‌ చేస్తూ కోటి తనదైన శైలిలో పాట రూపంలో ధన్యవాదాలు తెలిపారు కోటి.