కరోనా వైరస్ అలా బయటికి వచ్చిందట !

చైనా ప్రధాన నగరాల్లో వుహాన్ ఒకటి. ఇక్కడ బయటపడిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలని వణికిస్తోంది. అయితే చైనా చెబుతున్నట్టుగా కరోనా వైరస్ వుహాన్ నగరంలోని మాంసాహార మార్కెట్ లో పుట్టలేదట. ఈ మేరకు ఫ్యాక్స్ న్యూస్ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఈ వైరస్ కు నిలయమైన గబ్బిలాలపై వుహన్  లేబొరేటరీలో పరిశోధన చేస్తుండగా, తొలుత అక్కడ పనిచేసే వ్యక్తికి సోకడం ద్వారా వ్యాపించిందట.

వుహాన్ ల్యాబ్ లో జరిగిన ఈ ఘటనను కప్పిపుచ్చేందుకు చైనా ప్రయత్నాలు చేసిందని, మార్కెట్ ద్వారా వ్యాపించినట్లు చెప్పుకొచ్చిందని ఫాక్స్ తెలిపింది. వుహాన్ లోని వైరాలజీ ల్యాబ్ లో  సరైన ప్రమాణాలు పాటించకపోవడంతో అక్కడ పనిచేసే సిబ్బందిలో ఒకరికి ఈ వ్యాధి సోకింది. ఆమె తన బాయ్  ఫ్రెండ్ ను కలవడం, అతను మార్కెట్ కు వెళ్లడం అక్కడి నుంచి వ్యాధి ఇతరులకు వ్యాపించడం ద్వారా మహమ్మారిలా మారిందని ఫ్యాక్స్ తన కథనంలో పేర్కొంది.