బ్లౌజ్ పీస్ తో మాస్క్ తయారు చేసిన హీరోయిన్
మహమ్మారి కరోనా వైరస్ కి మందు లేదు. ముందు జాగ్రత్తలే శరణ్యం. పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడంతో పాటు తప్పనిసరిగా మొహానికి మాస్క్ ధరిస్తే.. కరోనా నుంచి తప్పించుకొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మాస్క్ లని సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చని, పలు స్వచ్చంద సంస్థలు, పలువురు ప్రముఖులు వీడియోల రూపంలో ప్రజలకి తెలియజేస్తున్నారు.
తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విద్యాబాలన్ కూడా ఇదే ప్రయత్నం చేశారు. బ్లౌజ్ పీస్ తో మాస్క్ ను ఎంత సులువుగా తయారు చేసుకోవచ్చు చూపిస్తూ తన ఇన్ స్ట్రా గ్రామ్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ మాస్క్ తయారీకి ఒక బ్లౌజ్ పీస్, రెండు రబ్బరు బ్యాండ్లు చాలని, అదే కనుక, చీరతో అయితే చాలా మాస్క్ లను తయారు చేసుకోవచ్చని విద్యా తెలిపింది.