3 నెలలు ఇళ్ల కిరాయి అడగవద్దు : కేసీఆర్

అద్దె ఇళ్లలో ఉండేవారికి సీఎం కేసీఆర్ తీపికబురు చెప్పారు. మూడు నెలల వరకు ఇంటి ఓనర్లు అద్దె అడగకూడదని చెప్పారు. ఇది రిక్వెస్ట్ కాదు. ఆర్డర్ అని చెప్పారు. మూడు నెలల తర్వాత కూడా విడతవారీగా అద్దె తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. దానికి వడ్డీ తీసుకోవద్దని హెచ్చరించారు. ఎవరైనా.. అద్దె ఇవ్వాలని డిమాండ్ చేస్తే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఆదివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినేట్ సమావేశం జరిగింది. దాదాపు 4గంటల పాటు సాగిన కేబినేట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. తెలంగాణలో లాక్ డౌన్ ని మే 7వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. రేపటి (ఏప్రిల్ 20) నుంచి లాక్ డౌన్  పై కేంద్రం ఇచ్చిన సడలింపులని తెలంగాణ ప్రభుత్వం పాటించలేదని తెలిపారు. మొత్తానికి మే 7వరకు లాక్ డౌన్ ని కఠినంగా అమలు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.