గోదాములుగా ఫంక్షన్ హాల్స్
కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఆదివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినేట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణలో లాక్ డౌన్ ని మే 7వరకు పొడగించారు. అంతేకాదు.. రేపటి (ఏప్రిల్ 20) నుంచి తెలంగాణలో ఎలాంటి లాక్ డౌన్ సడలింపులు ఉండవని సీఎం కేసీఆర్ తెలిపారు.
కరోనా కట్టడి విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం పంట కొనుగోలు, రైతుల విషయంపై శ్రద్ద తీసుకుంది. ఈ క్రమంలో ఎరువుల నిల్వల కోసం ఫంక్షన్ హాల్స్ ని వినియోగించుకోవాలని, దీనికి సంబంధించిన అధికారులని కలెక్టర్లకి ఇచ్చినట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. మరో నెలన్నరలో వర్షాకాలం వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ఎరువులు కొనుగోలు చేసుకోవాలని సీఎం సూచించారు.