సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ హైలైట్స్
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం ప్రగతి భవన్ లో తెలంగాణ కేబినేట్ సమావేశం జరిగింది. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినేట్ తీసుకున్న నిర్ణయాలని సీఎం కేసీఆర్ మీడియాకు వివరించారు. సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లోని ముఖ్యాంశాలు.. మీ కోసం.
* మే 7 వరకు లాక్డౌన్ పొడగింపు
* రేపటి (ఏప్రిల్ 20) నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి లాక్డౌన్ సడలింపులు ఉండవు. పాత మార్గదర్శకాలే.. మే 7వరకు పాటించాల్సిందే
* మే 5న మరోసారి పరిస్థితిని సమీక్షించి లాక్డౌన్పై నిర్ణయం తీసుకుంటాం
* 45 దేశాలు కంప్లీట్ లాక్డౌన్లో ఉన్నాయి.
* కంటైన్మెంట్ జోన్లలో ఇంకా కఠినంగా వ్యవహరిస్తాము.
* ఇంటి యజమానులు మూడ్నెళ్ల వరకు అద్దె అడగకూడదు.
* వచ్చే రెండేళ్ల వరకు స్కూల్ ఫీజులు పెంచవద్దు. నెలకోసారి ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలి
* రాష్ట్రంలోని అన్నీ ఫంక్షన్ హాల్స్ ని గోదాములుగా వాడుకోనున్నాం.
* ఏప్రిల్ నెలకి సంబంధించి ఉద్యోగులకి 50శాతం జీతాలు మాత్రమే ఇస్తాం
* పోలీసులకి పూర్తి జీతాలతో పాటు, 10శాత సీఎం కానుక అందజేస్తాం.