చంద్రబాబుకు పవన్ విషెస్


తెదేపా అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు పుట్టినరోజునేడు. ఈ సందర్భంగా ఆయనకి రాజకీయ, సినీ ప్రముఖులు, కార్యకర్తల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా చంద్రబాబుని విష్ చేశారు.

“గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో సంతోషకరమైన సంపూర్ణ జీవితం గడపాలని కోరుకుంటున్నాను” అని పవన్ రాసుకొచ్చారు.

అంతకుముందే మెగాస్టార్ చిరంజీవి చంద్రబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. “అహర్నిశం ప్రజా సేవలో దశాబ్దాలుగా కొనసాగుతున్న మీ సంకల్పబలం అనితరసాధ్యం. కలకాలం మీకు సంతోషం, ఆరోగ్యం  ప్రసాదించమని ఆ భగవంతుని కోరుతున్నాను. 70వ జన్మదిన శుభాకాంక్షలు సర్. మీ విజన్, మీ హార్డ్ వర్క్, మీ డెడికేషన్ సూపర్” అంటూ చిరు ట్విట్ చేశారు.